Home » KADAPA
TDP Mahanadu 2025 Live: కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం.
Pulivendula Tension: పులివెందులలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ మహానాడు సందర్భంగా పులివెందులలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు.
Mahanadu 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంటగదిలో మహిళల కష్టాలు చూడలేకా నాటి సీఎంగా ఉన్న చంద్రబాబు దీపం పథకాన్ని తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు.
CBN Warns: మహానాడు వేదికగా కోవర్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా.. ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
TDP Mahanadu 2025: మళ్ళీ జన్మ అంటూ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అని.. వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు.
TDP Mahanadu 2025: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహంపై పూలుజల్లి నివాళులర్పించారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని సీఎం కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ సక్సేనా మంగళవారం నాడు కడపలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు.
టీడీపీ ముఖ్య నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తొలి రోజు మహానాడు జరిగిన తీరుపై సమీక్షించారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చామని ఏపీ మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని వెల్లడించారు.
TDP Mahanadu 2025: పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎప్పుడూ అండగా ఉంటారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు.