Home » Jupally Krishna Rao
సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో త్వరలోనే కొత్త బ్రాండ్లతో కూడిన బీర్లు రానున్నాయి. ఈ మేరకు బీర్ల ఉత్పత్తి కోసం మద్యం కంపెనీలను ఆహ్వానించాలని.. దరఖాస్తులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో తమ బ్రాండ్ బీర్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ) సంస్థ ప్రకటించింది. బకాయిలు చెల్లించకపోవడం, ధరలు పెంచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Minister Jupalli Krishna Rao: కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ ప్రజలకు మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్నవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువులోని దీవుల్లో విడిది చేయడం, పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులకు ఇప్పుడైతే మధురానుభూతి కలిగిస్తోంది.
గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చం దంగా ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు టూరిజంపై పూర్తి సమాచారం కోసమే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో తెలంగాణ టూరిజం హెల్ప్‌డెస్క్ సెంటర్‌ను ప్రారంభించామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు.
ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్‌వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్‌కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.