బీఆర్‌ఎస్ కార్యకర్తల్ని వేధిస్తే ఊరుకోం: కవిత
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:37 AM
‘‘జూపల్లి కృష్ణారావు ముందు నియోజకవర్గానికి రావాలి. ఆయన టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టు మంత్రిలా వ్యవహరిస్తున్నారు.
కొల్లాపూర్/నాగర్‌కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘జూపల్లి కృష్ణారావు ముందు నియోజకవర్గానికి రావాలి. ఆయన టూరిజం మంత్రిలా కాకుండా టూరిస్టు మంత్రిలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఎంత పెద్ద నాయకులనైనా, అధికారులనైనా వదిలిపెట్టం. సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా కచ్చితంగా పింక్ బుక్ మెయింటెన్ చేస్తాం.
అందరి చిట్టా రాసుకుంటాం’’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సింగోటం, నాగర్‌కర్నూలులలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను మంత్రి జూపల్లి తీవ్రంగా వేధిస్తున్నారని, చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.