Home » Jubilee Hills
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, తమ జెండా పాతాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే ఇంకోవైపు..
కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీ పని చేస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని బీ టీమ్ అంటుందని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్.. రాజకీయ వ్యూహాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన వారిలో అత్యధికులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నారు. దాంతో ఇక్కడ ఉంటేనే సీఎం పదవి దక్కుతుందనే నమ్మకం కొంతమంది నేతల్లో బలంగా ఏర్పడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరక్క మజ్లిస్ క్యాండిడేట్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టిందని, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు.
బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు తన మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక పోరు మొదలు కానుంది. నామినేషన్ల దాఖలు పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో వ్యూహ, ప్రతి వ్యూహాలపై పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్ ఓటర్లను అభ్యర్థించారు. యూసుఫ్‌గూడలో ఆదివారం నవీన్‌యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు.
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్‌కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు, పోలీసుల తనిఖీల్లో నగదు, మద్యంతో పాటు ఉచితంగా పంపిణీ చేసే కానుకలూ పట్టుబడుతున్నాయి. అత్యల్పంగా డ్రగ్స్ కూడా పట్టుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.