Home » JNTU
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ప్రతిష్టాత్మక జేఎన్టీయూ కాలేజీలో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది విపరీతంగా పెరిగిన బీటెక్ ఫస్టియర్ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఆచార్యులను (కాంట్రాక్ట్ లేదా గెస్ట్) నియమించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. సాధారణంగా 66 నుంచి 72 మంది మాత్రమే ఉండాల్సిన తరగతి గదుల్లో, 80 నుంచి 97 మంది దాకా విద్యార్థులను చొప్పించారు. మొత్తం 13 (ఏ నుంచి ఎం వరకు) సెక్షన్లు ఉండగా, కొన్ని సెక్షన్లకు తరగతులు చాలకపోవడంతో వాటిని సెమినార్ హాల్స్‌లోకి మార్చారు.
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ 12నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ శుక్రవారం విడుదల చేశారు. గత మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయగా, మొత్తం 15 సబ్జెక్టుల్లో పీహెచ్డీ అడ్మిషన్ల నిమిత్తం 995మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
జేఎన్టీయూ ఇటీవల విడుదల చేసిన కోర్సుల అమరిక, సిలబ్‌సలో స్వయంప్రతిపత్తి (అటానమస్ హోదా) కల ఇంజనీరింగ్ కాలేజీలు గరిష్ఠంగా 20 శాతం మార్పులకు అనుమతించింది.
జర్మనీలోని రౌట్లింగన్ యూనివర్సిటీతో జేఎన్టీయూ కుదుర్చుకున్న ఎంఓయూ ప్రోగ్రామ్లన్నీ విద్యార్థులకు మేలు చేకూర్చేవేనని వీసీ కిషన్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
జేఎన్టీయూ ‘వన్‌టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్ కోర్సుల్లో 50 శాతానికిపైగా, బీటెక్‌లో 44.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
బీటెక్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 11నుంచే ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ, బుధవారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలండర్లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు.
జేఎన్టీయూ వర్సిటీ అనుబంధ, అఫిలియేటెడ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈసారి బీటెక్ ఫస్టియర్‌లో చేరుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ తీపికబురు చెప్పింది.
ఇంజనీరింగ్ విద్యలో ఒరవడులకు శ్రీకారం చుడుతూ జేఎన్టీయూ సరికొత్త సిలబస్‌ను, నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఆర్ 25 రెగ్యులేషన్స్ కోసమని ఏడాదిగా కసరత్తు చేస్తున్న వర్సిటీ అకడమిక్ అఫైర్స్ అధికారుల, నిపుణుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది.
విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ (ఫిట్) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్టీయూకు వారు చేరుకున్నారు.