Home » Jammu and Kashmir
లెహ్‌లో నిరసనలను రెచ్చగొట్టారంటూ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాంగ్‌చుక్ మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, దానికి ముందే ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఉద్యమం సాగిస్తున్నారు.
రాష్ట్రహోదా డిమాండ్‌లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.
పహల్గాం ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్'లో పలు ఆయుధాలు, సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటి ఫోరెన్సిక్ విశ్లేషణ అనంతరం ఉగ్రవాదులకు సహకరించిన మహమ్మద్ కటారియా అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ (లెజిస్లేచర్‌తో సహా), లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందని, రాజ్యసభకు నాలుగు ఖాళీలు ఏర్పడిన సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఎలక్టరేట్లు లేరని ఈసీ తెలిపింది.
జమ్ము ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ కనిపించడం కలకలం రేపింది. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ డ్రోన్ భారత భూభాగం వైపు వచ్చిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో గత 19 రోజులుగా నిలిచిపోయింది.
రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా రద్దయింది.