Home » Israel
ఇరాన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరులతోపాటు విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) చురుకుగా వ్యవహరిస్తూ, ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు (Indian Students Evacuated) తరలిస్తోంది.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ల అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకనుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణు దాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Iran Top Officials Killed in Israel Airstrikes: టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు మృతిచెందారు. బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ చీఫ్ హసన్ మొహాకిక్ ప్రాణాలు కోల్పోయారు.
Netanyahu Iran Trump: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ను చంపేందుకు రెండుసార్లు కుట్రపన్నారని ఆరోపించారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ వారం ఆరంభంలో ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అందుకు ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్ రకం పీపా (బ్యారెల్) చమురు ధర 13ు పెరిగి 78 డాలర్లకు చేరింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండడంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా బ్రిటన్ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తుండగా..
ఇజ్రాయెల్-ఇరాన్ గొడవ (Iran Israel conflict) త్వరలో ఆగిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ట్విస్ట్ ఇచ్చారు. భారత్-పాక్ లాగా ట్రేడ్ డీల్స్‌తో సెటిల్ చేస్తామని చెప్పారు. కానీ భారత్ ఆపరేషన్ సిందూర్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ హీరో అవుతారా?
ఇరాన్-ఇజ్రాయెల్ శత్రుత్వం 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవం నుంచి మొదలైంది. అప్పటి నుంచీ ఇరాన్.. ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా పరిగణిస్తూ వస్తోంది.