Pakistan: ఇరాన్‌తో అలాంటి ఒప్పందం లేదన్న పాకిస్థాన్
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:57 PM
ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మెహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుదాడి జరిపితే పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పారు.
టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారి, ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు జనరల్ మెహిసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అణుదాడి జరిపితే పాకిస్థాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని చెప్పారు. ఇరాన్ స్టేట్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పర క్షిపణి దాడులకు పాల్పడుతుండటంతో గత మూడురోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూక్లియర్ అటాక్‌పై పాక్ ఏమందంటే..
ఇజ్రాయెల్‌పై పాక్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందంటూ ఇరాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ వెంటనే స్పందించింది. అణు ప్రతీకారం (న్యూక్రియర్ రిటాలియేషన్)పై ఎలాంటి కమిట్‌మెంట్ తాము ఇవ్వలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తోసిపుచ్చారు. మూడవ పార్టీ ఘర్షణలతో తమ అణ్వాయుధాలకు ఎలాంటి లింక్ లేదన్నారు.
అణుఒప్పందం లేదు, సపోర్ట్ ఉంటుంది
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై పాకిస్థాన్ తన వైఖరిని ప్రస్ఫుటం చేసింది. ఇరాన్‌తో తమకు ఎలాంటి అణు ఒప్పందం లేదని, అయితే ఆ దేశానికి రాజకీయంగా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఇజ్రాయెల్ దురాక్రమణలను ఎదుర్కొనేందుకు ముస్లిం దేశాలు ఐక్యంగా నిలబడాలని కోరింది. దీనిపై జూన్ 14న నేషనల్ అసెంబ్లీలో ఆసిఫ్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌ను కలిసికట్టుగా ఎదుర్కోకుంటే ఇరాన్, పాలస్తీనాకు పట్టిన గతే పడుతుందని ముస్లిం దేశాలను హెచ్చరించారు. ఇరాన్, యెమెన్, పాలస్తీనాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందని, ముస్లిం దేశాలు ఇప్పుడైనా ఐక్యంగా నిలబడాలని అన్నారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు సాగిస్తున్న మెజారిటీ ముస్లిం దేశాలు ఆ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలన్నారు. కలిసికట్టుగా స్పందించేందుకు గానూ ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఓఐసీ) అత్యవసర సమావేశం జరపాలని పేర్కొన్నారు.
అణ్వాయుధాలపై..
ఇజ్రాయెల్ చాలాకాలంగా అణ్వాయుధాలపై అస్పష్ట వైఖరి ప్రదర్శిస్తోంది. అణ్వాయుధాలు ఉన్నట్టు కానీ లేనట్టు కానీ ధ్రువీకరించడం లేదు. అయితే ఇజ్రాయెల్ అణుసామర్థ్యం కలిగి ఉందని, ఆ ప్రాంతంలో వ్యూహాత్మక ఆధిపత్యం కోసం తహతహలాడుతోందని చెబుతున్నారు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలు కేవలం ఇంధన ఉత్పత్తి, మెడికల్ రీసెర్చ్ వంటి సివిలియన్ పర్పస్ కోసమేనని చెబుతోంది. అణ్యాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన ఇరాన్.. అణ్వాయుధాల అభివృద్ధిని బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. అయితే ఇరాన్ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ స్థాయిలు, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలపై పాశ్చాత్య ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. న్యూక్లియర్ యాక్టివిటీ విషయంలో ఇరాన్‌కు పారదర్శకత లేదని ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ దాడుల వేళ అక్కడి భారతీయులకు కీలక సూచన
36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి