Share News

Iran: మాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే.. పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు.. ఇరాన్ జనరల్

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:23 AM

పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణు దాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Iran: మాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే.. పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు.. ఇరాన్ జనరల్
Iran General Mohsen Rezae

పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి (Iran- Israel). ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణు దాడులు (Nuclear Attack) చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఐఆర్‌జీసీ జనరల్ మొహసిన్ రెజాయి (Mohsen Rezae) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై ఇజ్రాయెల్ అణు దాడికి దిగితే పాకిస్థాన్ (Pakistan) చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.


ఇజ్రాయెల్ తమపై అణు బాంబు ప్రయోగిస్తే వెంటనే పాకిస్థాన్ రంగంలోకి దిగుతుందని, ఇజ్రాయెల్‌పై పాక్ న్యూక్లియర్ అటాక్ చేస్తుందని జనరల్ మొహసిన్ రెజాయి హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి తమకు హామీ లభించిందని కూడా రెజాయి పేర్కొనడం గమనార్హం. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఇతర ఇస్లామిక్ దేశాలతో ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని, అలా జరిగితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయని జనరల్ మొహసిన్ రెజాయి అన్నారు. అయితే ఆయా ముస్లిం దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధం లేవని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద అణుబాంబులు లేవు. ఇజ్రాయెల్ మాత్రం అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో ఉంది.


ఇవీ చదవండి:

పాక్ ప్రకటనలు అవాస్తవం.. దసో ఏవియేషన్ స్పష్టీకరణ

భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 11:58 AM