Home » Israel Hamas War
గాజాలో మహిళలు పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియాకు స్థానిక మహిళలు తమ దయనీయ పరిస్థితుల అనుభవాలను వెల్లడించారు.
దోహాలోని హమాస్ స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అంటూ మండిపడింది. గాజాలో కాల్పుల విరమణ చర్చలపై ఈ దాడులు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో యెమెన్‌లోని హౌతీ నియంత్రిత సనా ప్రభుత్వ ప్రధాని అహ్మద్ అల్-రహవీ మరణించారు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఈ ఘటనను ధ్రువీకరించారు.
గాజాను ఆక్రమించుకోవడం తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. హమాస్‌ను గాజాకు విముక్తి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. పని పూర్తి చేయడం మినహా తమకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు.
Hostage Digs Own Grave: వ్యతార్ డేవిడ్ అనే 24 ఏళ్ల ఇజ్రాయెల్ పౌరుడికి సంబంధించిన వీడియోను హమాస్ గ్రూపు విడుదల చేసింది. ఆ వీడియోలో ఎవ్యతార్ బాగా బక్కచిక్కిపోయి ఉన్నాడు. చూడ్డానికి ఎముకల గూడులా కనిపిస్తూ ఉన్నాడు.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు తాము సిద్ధమేనని కెనడా ప్రధాని కార్నీ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. ద్విదేశ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
గాజాకు మానవతా సాయం అందేందుకు వీలుగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో జన సాంద్రత అధికంగా ఉన్న ఓ మూడు ప్రాంతాల్లో పగటి పూట దాడులు జరగవని హామీ ఇచ్చింది.
హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించట్లేదంటూ ట్రంప్ మండిపడ్డారు. హింసను ఎంచుకున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసి పని ముగించాలని అభిప్రాయపడ్డారు.
గాజాలో రోజురోజుకు పరిస్థితి ఇంకా దిగజారుతోంది. తాజాగా జరిగిన వైమానిక దాడిలో హమాస్‌కు చెందిన ప్రముఖ కమాండర్ బషార్ థాబెట్ మృతి చెందాడు. ఈ దాడికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) అధికారికంగా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో గాజా ప్రాంతం మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇజ్రాయెల్ తాజాగా జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మంచి నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లిన సమయంలో దాడి జరగడంతో మృతి చెందినట్టు స్థానిక ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది తెలిపారు.