Home » IPL 2025
భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సరైనదేనని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అతడు ఇంకొన్నేళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..
ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ మీద కన్నేసిన ముంబై ఇండియన్స్.. కీలక మ్యాచులకు ముందు రాక్షసులను రంగంలోకి దింపుతోంది. వీళ్లు గానీ రాణిస్తే ఇంకో కప్పు కొట్టకుండా ఎంఐని ఎవరూ ఆపలేరు. మరి.. వాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్‌లో హీట్ పుట్టించింది.
ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ చివరి దశకు వచ్చేసింది. ఈ సీజన్ మొదట్లో ఉన్న ఉత్కంఠ, ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. సోమవారం లక్నో సూపర్ జాయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ప్లేఆఫ్ సినారియో పూర్తిగా మారిపోయింది.
ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మరో కీలక మ్యాచ్‌కు తెరలేచింది. లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ప్లేఆఫ్స్ బెర్త్ తేల్చేసే ఫైట్ జరుగుతోంది. ఆరెంజ్ ఆర్మీ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గినా.. ఓడినా.. ఆ టీమ్‌కు కొత్తగా వచ్చేది, పోయేదేమీ లేదు. అయితే లక్నో మాత్రం నెగ్గి తీరాల్సిన సిచ్యువేషన్‌లో ఉంది.
ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రాణించారు. ఆ జట్టు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ మరోసారి రాణించి అర్ధశతకాలు సాధించారు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది.
ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు పాయింట్స్ టేబుల్‌ను డిస్ట్రబ్ చేయకపోవచ్చు. కానీ భారత క్రికెట్ భవిష్యత్ దృష్ట్యా ఈ పోరులో తలపడబోయే ప్లేయర్లు రాణించడం చాలా కీలకమనే చెప్పాలి.
లక్నో వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ మొదలైపోయింది. ఈ పోరులో టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ ప్యాట్ కమిన్స్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది. మరోవైపు టోర్నీ ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లఖ్‌నవూ తర్వాత చేతులెత్తేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది.