IPL 2025 SRH vs LSG: చితక్కొట్టిన ఓపెనర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - May 19 , 2025 | 09:25 PM
ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రాణించారు. ఆ జట్టు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ మరోసారి రాణించి అర్ధశతకాలు సాధించారు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది.
ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రాణించారు. ఆ జట్టు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ మరోసారి రాణించి అర్ధశతకాలు సాధించారు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ భారీ స్కోరు సాధించింది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లఖ్‌నవూ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న లఖ్‌నవూ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), మార్‌క్రమ్ (61) బౌండరీల వర్షం కురిపించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. మార్ష్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (7) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (45) మరోసారి కీలక పరుగులు చేశాడు. దీంతో లఖ్‌నవూ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో ఎషాన్ మలింగ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు. మరి, లఖ్‌నవూ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఎలా ఛేదిస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే లఖ్‌నవూ టీమ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..