Share News

IPL 2025 SRH vs LSG: ట్రావిస్ హెడ్ ఆడతాడా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - May 19 , 2025 | 05:06 PM

గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది. మరోవైపు టోర్నీ ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లఖ్‌నవూ తర్వాత చేతులెత్తేసింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది.

IPL 2025 SRH vs LSG: ట్రావిస్ హెడ్ ఆడతాడా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
SRH vs LSG

ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్లు అనుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లు తడబడుతున్నాయి. గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది. మరోవైపు టోర్నీ ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లఖ్‌నవూ తర్వాత చేతులెత్తేసింది (LSG vs SRH). ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది.


ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆ జట్టు ఓపెనర్లే ప్రధాన బలం. అయితే ఈ రోజు మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఆడేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే అతడికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వరకు అతడు భారత్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆడేది అనుమానంగా మారింది. ట్రావిస్ హెడ్ ఆడకపోతే అతడి స్థానంలో కమిందు మెండిస్ ఆడే అవకాశం కనబడుతోంది.

LSG2.jpg


అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ సన్‌రైజర్స్ జట్టుకు కీలక ఆటగాళ్లు. మరోవైపు లఖ్‌నవూ టీమ్ కూడా టాపార్డర్ బ్యాటర్లు అయిన ఐదెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ మీదనే పూర్తిగా ఆధారపడుతోంది. పంత్ వరుసగా విఫలమవుతున్నాడు. డేవిడ్ మిల్లర్ కూడా రాణించలేకపోతున్నాడు. ఇక బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏకనా స్టేడియంలోని పిచ్ స్లో బౌలర్లకు మద్దతుగా నిలుస్తుంది. పేస్, బౌన్స్ పెద్దగా ఉండదు. టాస్ గెలిచిన వారు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేశ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, ఐదెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ, ఆవేష్ ఖాన్, శార్దూల్ ఠాకూర్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 19 , 2025 | 05:06 PM