Home » IPL 2025
ఒక్క మాటతో అంతా మారిపోయిందని అంటున్నాడు ఆర్సీబీ తాత్కాలిక సారథి జితేష్ శర్మ. అతడు చెప్పిన మాటలతో తాను రెచ్చిపోయి ఆడానని చెబుతున్నాడు. మ్యాచ్ మారిపోవడానికి అదే కారణమని బయటపెట్టాడు.
అసలే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో షాక్ తగిలింది. అతడి వేతనంలో కోత విధించింది బీసీసీఐ. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చరిత్ర సృష్టించింది. లక్నో సూపర్ జయింట్స్‌పై నిన్న జరిగిన మ్యాచులో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్ 1కి చేరింది. ఈ క్రమంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇది అత్యధిక స్కోరు ఛేజింగ్‌గా (Bangalore Record Chase) నిలిచింది.
2025 ఐపీఎల్ సీజన్‌లో మే 27న విరాట్ కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. కేవలం 24 పరుగులు అవసరమైన దశలో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, ఆ టార్గెట్‌ను చేరుకుని, టీ20ల చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున 9000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ జితేష్ శర్మ (85 నాటౌట్) కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించాడు. విరాట్ కోహ్లీ (54) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
సీజన్ అంతా పేలవ ఫామ్‌తో సతమతమైన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పని చెప్పాడు. చిట్ట చివరి మ్యాచ్‌లో మెరుపు శతకంతో అదరగొట్టాడు. మరోవైపు టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు పేలవ ప్రదర్శన చేశారు.
పించ్ హిట్టర్ రిషబ్ పంత్ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన ఈ లక్నో సారథి.. ఆఖరాటలో ఆర్సీబీపై చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఐపీఎల్-2025 టికెట్ల వ్యవహారంలో తప్పు ఎవరిదో విజిలెన్స్ తేల్చేసింది. హెచ్‌సీఏ అక్రమాలపై చేసిన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది.
టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో కీలక సమరానికి రెడీ అవుతోంది. టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది.