IPL 2025 RCB vs LSG: టాస్ గెలిచిన బెంగళూరు.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - May 27 , 2025 | 07:04 PM
టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది.
టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి చవిచూసిన ఆర్సీబీ ఈ రోజు మ్యాచ్‌లో గెలిచి తీరాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ టాప్-2కు చేరుకుంటుంది.
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. రజత్ పటిదార్ గాయంతో సతమతమవుతున్నాడు. దీంతో జితేశ్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంపాక్ట్ సబ్‌గా రజత్ బరిలోకి దిగే అవకాశం కనబడుతోంది. కాగా, ఈ సీజన్‌కు సంబందించి ఈ రోజు జరగబోయేదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత ప్లే ఆఫ్స్ మొదలుకాబోతున్నాయి. కాగా, ఇప్పటికే ఆర్సీబీ తాజా ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది.
తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి