IPL 2025 RCB vs LSG: బెంగళూరుకు కీలక సమరం.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 27 , 2025 | 06:11 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో కీలక సమరానికి రెడీ అవుతోంది. టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో కీలక సమరానికి రెడీ అవుతోంది. టాప్-2లోకి చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డడానికి సిద్ధమవుతోంది. ఈ రోజు లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లో గెలిచి మంచి జోరు చూపించిన ఆర్సీబీకి గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకిచ్చింది. ఈ పరాభవాన్ని మర్చిపోయి ఈ రోజు మ్యాచ్‌లో గెలిచి తీరాలని ఆర్సీబీ కృతనిశ్చయంతో ఉంది.
అనారోగ్యం నుంచి కోలుకుని జాష్ హాజెల్‌వుడ్ తిరిగి రావడం ఆర్సీబీకి కొండంత బలాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన హాజెల్‌వుడ్ 18 వికెట్లు తీసి ఆర్సీబీ టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఇక, ఎప్పటిలాగానే విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కీలక ప్లేయర్. ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ కీలక బ్యాటర్లు. అలాగే కృనాల్ పాండ్యా, షెపర్డ్ అవసరమైనపుడు రాణిస్తున్నారు. హాజెల్‌వుడ్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ కూడా రాణిస్తున్నారు.

ఇక లఖ్‌నవూ టీమ్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్‌క్రమ్‌తో పాటు నికోలస్ పూరన్‌పైనే లఖ్‌నవూ ఎక్కువగా ఆధారపడుతోంది. వారి విఫలమైతే మాత్రం కష్టాలు తప్పడం లేదు. రిషభ్ పంత్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్ విభాగం బలహీనంగా కనబడుతోంది. లఖ్‌నవూ టీమ్ ఇప్పటికే ఈ సీజన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సీజన్‌కు సంబందించి ఈ రోజు జరగబోయేదే చివరి లీగ్ మ్యాచ్.
తుది జట్లు:
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (అంచనా): మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్
రాయల్ ఛాలెంజర్స్ (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి