Home » International News
మధ్యప్రాశ్చంలో సుస్థిర శాంతి నెలకొనేందుకు ద్విదేశ విధానానికి ఒట్టావా మద్దతిస్తోందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు 'సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, సుస్థిర పాలస్తీనా' ఏర్పాటు కీలకమని పేర్కొంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
H-1B వీసాలపై ఏడాదికి $100,000 ఫీజు విధించే అమెరికా కొత్త నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం భారతీయ టెక్ నిపుణులపై ప్రభావం చూపనుంది. అయితే దీనిపై యూఎస్ అధికారులు క్లారిటీ ఇవ్వగా, భారత రాయభార కార్యాలయం హెల్ప్ లైన్ ప్రకటించింది.
సాంకేతిక కారణాల వల్ల విమానాల ప్రయాణాల్లో జాప్యం తలెత్తినట్టు లండన్ హీత్రో ప్రకటించింది. దాదాపు యూరప్‌లోని అన్ని ప్రఖ్యాత విమానాశ్రయాలు సైబర్ దాడికి గురైనట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
తెలంగాణకు చెందిన 29 ఏళ్ల మహ్మద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్‌మేట్‌తో జరిగిన గొడవ తర్వాత శాంటాక్లారా పోలీసులు అతడిని కాల్చి చంపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులపై బాంబ్ వేశారు. హెచ్1బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయం అమెరికాలోని పలు టెక్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. దీంతో యుద్ధ వేదికపై ఒక్కటిగా కొనసాగనున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజును పురష్కరించుకుని పలు దేశాల అధినేతలు, ప్రధాన మంత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..