Home » India vs Pakistan
గతేడాది అమెరికా-వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ మెగా టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన‌్‌కు అన్ని విధాలా దెబ్బ తీసిన ఇండియా... ఇప్పుడు ద్వైపాక్షిక ఒత్తిడికి సిద్ధమైంది. విదేశాంగ మంత్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పలు దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు కూడా కేంద్రం వివరాలు ఇవ్వనుంది.
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
భారత్-పాకిస్తాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా..
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి.. భారతదేశం - పాకిస్థాన్ మధ్య యుద్ధానికి దారి తీసింది. పహల్గాం దాడికి పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులే కారణమని గుర్తించిన భారత్.. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.
Operaion Sindoor: దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది.
Indian Army: యావత్ దేశమంతా ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ చేస్తున్న వార్ గురించి డిస్కస్ చేస్తున్నారు. దాయాదిపై మన సైనికులు విజృంభిస్తున్న తీరు గురించి చర్చించుకుంటున్నారు. యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూపించడంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టార్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరిపిందని, షెల్లు, మోర్టార్లను ప్రయోగించిందని, విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని అధికారులు తెలిపారు.
Operation Sindoor: భారతీయ పౌరుల ఊపిరి తీసి.. హాయిగా సేద తీరుతున్న ఉగ్ర మూకలను ఊచకోత కోసింది ఇండియన్ ఆర్మీ. సరిగ్గా తెల్లవారుజాము సమయంలో.. ఊహించని రీతిలో అటాక్ చేసి ఆ నర రూప రాక్షసుల అంతు చూసింది. 9 ఉగ్ర శిబిరాలపై ఏక కాలంలో 24 క్షిపణులు దాడి చేసి సమస్తం నేలమట్టం చేశాయి.