Share News

India vs Pakistan: భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:45 PM

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.

India vs Pakistan: భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
India vs Pakistan

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి (India vs Pakistan). గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. సూపర్-4 మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ (Bazid Khan) ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.


'పాకిస్థాన్ కంటే భారత జట్టు చాలా మెరుగ్గా ఉంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. భారత్ ముందు పాకిస్థాన్ జట్టు చాలా చిన్నగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పాక్ బౌలర్లు త్వరగా వికెట్లు తీయగలిగితే ఏదైనా అవకాశం ఉండొచ్చు. ప్రకృతి సహకరిస్తే తప్ప పాక్ గెలుపు కష్టం' అని బాజిద్ ఖాన్ వ్యాఖ్యానించారు (Asia Cup 2025 Super 4,).


గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 128 పరుగులు చేసింది (IND vs PAK analysis). టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరి, ఈ రోజు జరగబోయే మ్యాచ్ మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 03:36 PM