Share News

India vs Pakistan: మ్యాచ్ ఆడాలా? వద్దా? భారత ఆటగాళ్ల అంతర్మథనం.. కోచ్‌తో సుదీర్ఘ చర్చలు..

ABN , Publish Date - Sep 14 , 2025 | 10:24 AM

చాలా నెలల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ విషయంలో భారత ఆటగాళ్లు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు.

India vs Pakistan: మ్యాచ్ ఆడాలా? వద్దా? భారత ఆటగాళ్ల అంతర్మథనం.. కోచ్‌తో సుదీర్ఘ చర్చలు..
India vs Pakistan

చాలా నెలల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగనున్న మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు బరిలోకి దిగుతున్నాయి (India vs Pakistan). అయితే ఈ మ్యాచ్ విషయంలో భారత ఆటగాళ్లు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. దీంతో ఆటగాళ్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్టు సమాచారం (Cricket boycott news).


ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా ఆలోచించాలని, మిగతా మ్యాచ్‌ల్లాగానే పాకిస్థాన్‌తో కూడా ఆడాలని మేనేజ్‌మెంట్ దిశానిర్దేశం చేస్తోంది (Indian dressing room). అయితే సోషల్ మీడియా చూస్తే పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుత టీమిండియా పూర్తిగా యువరక్తంతో నిండి ఉంది. ఇంటెన్సివ్ నెట్ సెషన్ తర్వాత తమ ఫోన్లు తిరిగి తీసుకున్న వెంటనే వారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో బాయ్‌‌కాట్ పాకిస్థాన్ మ్యాచ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఆటగాళ్లు, కోచ్ సహా ఎవరూ రాలేదు (IND vs PAK tension).


దీనిని బట్టి టీమిండియా ఎంత ఒత్తడిలో ఉందో అర్థం చేసుకోవచ్చు (Asia Cup controversy). ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్‌ కూడా అంగీకరించాడు. గాయపడిన ప్రజల మనోభావాలను ఆటగాళ్లు మోస్తున్నారని ఆయన చెప్పాడు. ప్రజల భావాలు తమకు తెలుసుని, కానీ ఇలాంటి సున్నిత సమయంలో తామంతా ఎంతో ప్రొఫెషనల్‌గా ఉండాలని చెప్పాడు. మైదానంలోకి దిగే ముందు ఎలాంటి భావోద్వేగాలు ఉండకూడదని డోస్చేట్ చెప్పాడు.


ఇవి కూడా చదవండి

ఎన్ని సార్లు డకౌట్ అయినా.. మళ్లీ ఛాన్స్.. గౌతమ్ గంభీర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..


అందుకే తీసుకోలేదు.. తొలిసారి స్పందించిన బ్యాటింగ్ కోచ్..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 14 , 2025 | 10:51 AM