Arshdeep Singh Asia Cup: అర్ష్‌దీప్‌ను అందుకే తీసుకోలేదు.. తొలిసారి స్పందించిన బ్యాటింగ్ కోచ్..
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:12 AM
ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందరూ అనుకున్నట్టుగా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక పేసర్‌తో టీమిండియా బరిలోకి దిగింది.
ఆసియా కప్-2025 (Asia Cup 2025)లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అందరూ అనుకున్నట్టుగా అర్ష్‌దీప్ (Arshdeep Singh)ను తుది జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒకే ఒక పేసర్‌తో టీమిండియా బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబేలను ఫాస్ట్ బౌలింగ్ కోసం వాడుకుంది. ఏకంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి అందరికీ షాకిచ్చింది (Arshdeep Singh Asia Cup).
తుది జట్టు కూర్పుపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ స్పందించారు. 'తుది జట్టు ఎంపిక విషయంలో ఎటువంటి ఎజెండా లేదు. జట్టుకు ఏది అవసరం అనే దానిని దృష్టిలో ఉంచుకుని తుది జట్టు ఎంపిక జరుగుతుంది. జట్టుకు ఏది మంచిదో కెప్టెన్, ప్రధాన కోచ్ నిర్ణయించుకుంటారు. జట్టులో ఉన్న 15 మంది మైదానంలోకి దిగడానికి అర్హులే. కానీ, అందరికీ చోటు దొరకదు. పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టును బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. ఆ పిచ్ మీద స్పిన్నర్లకు మద్దతు లభిస్తుందని అనుకున్నాం. అందుకే అర్ష్‌దీప్‌ను తీసుకోలేదు' అని సితాన్షు చెప్పారు (Arshdeep controversy).
అలాగే, సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా సితాన్షు స్పందించారు (India coach statement). 'సంజు 5 లేదా 6వ స్థానంలో పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. దాని అర్థం అతడు ఆయా స్థానాల్లో బ్యాటింగ్ చేయలేడని కాదు. సంజు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల మంచి ఆటగాడు. జట్టు అవసరాల దృష్ట్యా కెప్టెన్, ప్రధాన కోచ్ నిర్ణయం ప్రకారం ఏ నంబర్‌లోనైనా బ్యాటింగ్ చేయడానికి సంజు సిద్ధంగా ఉన్నాడు' అని సితాన్షు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి