ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్... నామినీగా మహ్మద్ సిరాజ్
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:44 PM
ఆగస్టు నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీల జాబితాలో భారత్ తరఫున మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన సిరాజ్‌ను ఐసీసీ నామినీగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ తాజాగా ఆగస్టు నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ తరఫున పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు (Mohammed Siraj) చోటు దక్కింది. ఇంగ్లండ్‌తో ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. సిరాజ్‌తోపాటు ఈసారి నామినేట్ అయిన మ్యాట్ హెన్రీ, జేడెన్ ఫాస్ట్ కూడా ఫాస్ట్ బౌలర్స్ కావడం ఆసక్తి రేపుతోంది (ICC Player of the Month Nominee).
ఇక సిరాజ్ గత నెలలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన విషయం తెలిసిందే. కానీ ఈ ఒక్క గేమ్ తోనే అతడు ఐసీసీ దృష్టిలో పడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో అతడు 21.11 సగటుతో తొమ్మిది వికెట్లు రాబట్టాడు. ఆ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా లేని లోటును భర్తీ చేస్తూ బౌలింగ్ విభాగంలో జట్టుకు కీలకంగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో మొత్తం 46 ఓవర్లు వేసిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను రాబట్టాడు.
ఇక గత నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ 9.12 సగటుతో ఏకంగా 16 వికెట్లు రాబట్టాడు. రెండు పర్యాయాలు ఐదు వికెట్లు చొప్పున తీసి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఈ మ్యాచుల్లో తన సత్తా చాటి.. న్యూజిలాండ్‌కు సిరీస్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ బౌలర్ జెయిడెన్ సీల్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 4.1 ఎకానమీ రేటుతో 10 వికెట్లు రాబట్టి పాక్ పతనానికి బాటలు వేశాడు. మూడో వన్డేలో ఏకంగా ఆరు వికెట్ల తీసి వెస్టిండీస్‌కు సిరీస్ సొంతమయ్యేలా కీలకపాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ తలపడుతుందా.. బీసీసీఐ ఏమందంటే..
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి