Gautam Gambhir: ఎన్ని సార్లు డకౌట్ అయినా.. మళ్లీ ఛాన్స్.. గౌతమ్ గంభీర్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:58 AM
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్-2025లో భాగంగా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్‌నకు చోటు లభించకపోవడంతో పాటు గంభీర్ 'ప్రాజెక్ట్ సంజూ' గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir)పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆసియా కప్-2025లో భాగంగా టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్‌నకు చోటు లభించకపోవడంతో పాటు గంభీర్ 'ప్రాజెక్ట్ సంజూ' గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర చర్చకు తెరలేపాడు (Project Sanju).
'అర్ష్‌దీప్ ఒకానొక సమయంలో నెంబర్ వన్ టీ-20 బౌలర్. అలాంటి ఆటగాడికి తుది జట్టులో చోటు కల్పించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఇది కొత్త విషయం కాదు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇలా జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అర్షదీప్‌నకు అవకాశం రాలేదు. దుబాయ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉంది. గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ గెలిచినప్పుడు కూడా స్పిన్నర్ల మీదనే ఎక్కువగా ఆధారపడ్డాడు' అని అశ్విన్ పేర్కొన్నాడు (India vs Pakistan).
'సంజు శాంసన్‌కు గౌతమ్ గంభీర్ అసాధారణ మద్దతు ఇస్తున్నాడు. ఇది ప్రాజెక్ట్ సంజు శాంసన్. సంజూకు గౌతమ్ గంభీర్ ఒక మాట ఇచ్చాడు. 'నీవు 21 సార్లు డకౌట్ అయినా, 22వ మ్యాచ్‌లో నీకు అవకాశం ఉంటుంది' అని చెప్పాడు. ఇది కోచ్, కెప్టెన్ సంజుపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. సంజును టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేయనివ్వడం సరైనది అవుతుంది. అయితే, జట్టు కూర్పు విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి' అని అశ్విన్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి
అర్ష్‌దీప్‌ను అందుకే తీసుకోలేదు.. తొలిసారి స్పందించిన బ్యాటింగ్ కోచ్..
ఎందుకంత కోపం.. నేను నిజం మాత్రమే చెప్పాను: లలిత్ మోదీ
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి