Home » India vs Australia
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌కు ఆదరణ లేకపోవడానికి కారణమేంటో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ తెలిపారు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ నిర్వహించడం చాలా తప్పిదమని, వరుస గేమ్‌లు క్రికెట్‌లోని మజాను చంపేస్తున్నాయని హస్సీ అభిప్రాయపడ్డాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ మరికొంత కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ప్రారంభం కాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో హెడ్ కోచ్‌గా ఉండాలని ఇప్పటికే రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పెంచే అవకాశాలున్నాయని పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్స్ పేర్కొంటున్నాయి.
ఆస్ట్రేలియాతో ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులిచ్చి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.
Glenn Maxwell: భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ విశ్వరూపం చూపించాడు. 223 పరుగుల భారీ లక్ష్య చేధనలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో 68/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను మ్యాక్సీ తన అధ్బుత ఆటతో గెలుపుబాట పట్టించాడు.
Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.
వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్ సింగిల్ హ్యాండెడ్‌గా తన జట్టుని గెలిపించిన సందర్భం గుర్తుందా? ఇప్పుడు భారత్‌తో జరిగిన మూడో టీ20లోనూ..
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టేందుకు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. తన తర్వాతి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 2-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.