Home » INDIA Alliance
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.
‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్ సీఎన్‌ఎన్-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.
ఇండియా కూటమి విషయంలో తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వరం మారింది. సీట్ల పంపకం అంశంలో కాంగ్రె్‌సతో వచ్చిన విభేదాల వల్ల ‘ఇండియా’కు దూరంగా ఉన్న ఆమె బుధవారం కూటమికి మద్దతుగా మాట్లాడారు. హుగ్లీ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడుతూ.. 400 స్థానాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపడతామంటూ బీజేపీ చెబుతున్న మాటలను తోసిపుచ్చారు.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమియేతర పార్టీలపైనే పరిశీలకుల దృష్టి ప్రధానంగా ఉంది. త్రిశంకు సభ (హంగ్ పార్లమెంటు) ఏర్పడిన పక్షంలో (నెల రోజుల క్రితం కంటే ఇది ఇప్పుడు సంభావ్య పరిణామంగా కనిపిస్తోంది) ప్రభుత్వం ఏర్పాటులో ఈ ‘అలీన’ పార్టీలే కీలక పాత్ర వహించనున్నాయి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మూడు దశల ఎన్నికలు ముగిశాయి.. సగం పైగా స్థానాల్లో పోలింగ్ అయిపోయింది..! మరి.. రాజకీయ వాతావరణం ఎలా ఉంది? బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడునుందా? కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గాలి వీస్తోందా? దీనిపై ఆ రెండు పక్షాలు తమతమ వాదనలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలకు విన్నవించారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నాయకుల మీద తాము చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఇండియా కూటమి నాయకులు ఎలక్షన్ కమిషన్‌ను కోరారు. మొదటి రెండు దశల పోలింగ్ వివరాల వెల్లడిలో జాప్యం జరగడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్‌సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.