Home » HYDRA
ప్రభుత్వ భూమి కబ్జాపై ఇటీవల ‘ప్రజావాణి’లో అందిన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విచారణ జరిపారు. దాదాను 100 ఎకరాల మేర చెరువు భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు అందింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా కేసులకు సంభందించి విచారణను నాంపల్లి 9వ చీఫ్ డిస్ర్టిక్ట్ మెజిస్ర్టేట్ కోర్డులో జరపనున్నారు.
చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ పనులపై పూర్తి వివరాలు ఇవ్వాలని హైడ్రా అధికారులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
అనుమతులు లేని హోర్డింగ్‌లను తొలగించేందుకు ఆదివారం వరకు గడువు ఇస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. నిర్ణీత గడువులోపు స్వయంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
రోడ్లు, పార్లుల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా చెరువులపైనా దృష్టి సారించింది. గురువారం కుత్బుల్లాపుర్ మండలం జగద్గిరిగుట్టలోని పరికి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించింది.
‘ఎందుకంత తొందర.. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్(Hyderabad) పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా(HYDRA)ను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచే ఇసుక లారీల తనిఖీని మొదలుపెట్టింది.
Hydra: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నగర శివారులో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా. కోమటికుంటలో అక్రమ నిర్మాణాలపై యజమానులకు నోటీసులు ఇవ్వగా.. స్పందిచకపోవడంతో కూల్చివేసింది హైడ్రా.
నగరం, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతలన్నింటితో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్(Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. బుధవారం మూసీ నది వెంట జరిగిన కూల్చివేతలు హైడ్రా చేపట్టినట్టు దుష్ప్రచారం చేశారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.