Home » Hyderabad News
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రత కస్టడీకి సంబంధించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఓ యువకుడిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి బలమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో చదువుకునేందుకు సోమాలియా నుంచి వచ్చిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలతో లోతైన దర్యాప్తు జరుగుతున్నది, టెర్రస్ పైన ఉన్న కార్మికులు సురక్షితంగా ఉన్నారు.
ప్రపంచ మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు తమ మాతృభాషలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాదులో టీ-హబ్‌లో జరిగిన ‘హెడ్ 2 హెడ్’ పోటీతో పాటు కిమ్స్ ఆస్పత్రి సందర్శన కార్యక్రమాలు కూడా జరిగాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరచాలని, ప్రజలకు చేరువ కావాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యవహరించాలని, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు సరిదిద్దాలని సూచించారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకులు ఢిల్లీలో తుది చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కొత్త పదవి కావాలంటే రాజీనామా చేయాలన్న నిబంధన అమల్లోకి వస్తోంది.