Home » High Court
చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.
బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్కు పిలుపునిస్తామని పేర్కొన్నారు.
పార్వతీపురం మెడికల్ కాలేజీ పీపీపీ విధానంలో చేపట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఐదేళ్ల పాలనా కాలంలో పార్వతీపురం మెడికల్ కాలేజీకి వైసీపీ అసలు టెండర్లే పిలవని వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అక్టోబర్ 25 నుంచి 29 వరకూ కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్ ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్పును గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై మొత్తం 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు.. బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టింది..
పిటిషనర్లను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచించింది. తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించింది.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ ప్రారంభమైన కాసేపటికే వాయిదా వేస్తూ ధర్మాసనం ప్రకటించింది. తిరిగి ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషనర్ నవీన్ కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. టీవీకే నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటషన్లపై ఆదేశాలను జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీఓ ఇవ్వడం సరికాదని చెప్పింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది.