High Court Questions BookMyShow: అఖండ 2 పిటిషన్‌పై విచారణ.. బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:14 PM
తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై నిన్న(గురువారం) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది.
హైదరాబాద్: ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ ‘బుక్ మై షో’పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవటంతో సదరు సంస్థపై మండిపడింది. గురువారం తెలంగాణ హైకోర్టులో అఖండ 2 సినిమా టికెట్ల ధర పెంపుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసింది. అయితే, కోర్టు తీర్పు ఇచ్చినా బుక్‌మై షోలో పెంచిన ధరకు టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో కోర్టు ఆగ్రహానికి గురైంది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అంటూ మండిపడింది.
ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు పెంచిన ధరతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని బుక్ మై షోను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇస్తూ.. తమకు ఉత్తర్వులు అందే లోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారని బుక్ మై షో కోర్టుకు తెలిపింది. హై కోర్టు స్పందిస్తూ.. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా? లేదా అని ప్రశ్నించింది. ఎందుకు మీ మీద కంటెంప్ట్ యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలని అడిగింది. విచారణను మధ్యాహ్నం 1 గంటకు వాయిదా వేసింది. 1 గంట సమయంలో విచారణ మళ్లీ మొదలైంది.
ప్రభుత్వ జీవోలో ఏముందంటే..
అఖండ-2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై 50 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు అనుమతి కల్పించింది. డిసెంబర్ 11వ తేదీ ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
కదిలే రైల్ డోర్ పట్టుకొని యువకుడి పుష్-అప్స్.. పట్టు వదిలితే పరలోకానికి పయనమే..