Home » Harish Rao
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎప్‌సెట్-2025 ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి విడుదల చేయడం అహంభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Harish Support To Soldiers: సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా అని... దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారని హరీష్ రావు తెలిపారు. పాకిస్థాన్..భారత దేశం నుంచి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
BRS leader Harish Rao: సిద్ధిపేట మార్కెట్ యార్డ్‌లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని.. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్‌లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ రెండు కార్లపై బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఉపాధి హామీ పథకం కోసం గత ఏడాదిలో 12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా ఈసారి కేవలం 6.5 కోట్లకే పరిమితం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ఏం తప్పావో ఒకసారి మీ మ్యానిఫెస్టో చూసుకో. పదేళ్లు అధికారంలో ఉంటానంటూ పగటి కలలు కంటున్నావ్.. ఈ మూడేళ్లు నీ సీఎం కుర్చీ చేజారిపోకుండా చేసుకో’’ అని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎ్సఏ) ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి హరీశ్ చెప్పారు.
కాంగ్రెస్ పాలన దశ, దిశ లేకుండా సాగుతోందని హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో వైఫల్యం చూపించిందని ఆయన పేర్కొన్నారు, మరియు బీఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు