Share News

Harish Rao: మానసిక రోగి మృతికి బాధ్యులెవరు?

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:32 AM

మానసికవైద్యం పొందేందుకు ఆస్పత్రిలో చేరిన రోగులకు నాణ్యమైన భోజనంపెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: మానసిక రోగి మృతికి బాధ్యులెవరు?

  • ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్‌పాయిజన్‌ బాధాకరం

  • వృద్ధ రైతును పోలీసు గెంటేయడం అమానుషం

  • చివరికి కోడెలకు ఆహారం పెట్టలేని దుస్థితి: హరీశ్‌

హైదరాబాద్‌/నర్సాపూర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): మానసికవైద్యం పొందేందుకు ఆస్పత్రిలో చేరిన రోగులకు నాణ్యమైన భోజనంపెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఒకేసారి 70మంది ఫుడ్‌ పాయిజన్‌కు గురికావడం, అందులో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఫుడ్‌పాయిజన్‌ వల్ల మానసిక రోగి మృతికి బాధ్యులెవరు? ఆరోగ్యశాఖకు పట్టింపులేదా? అని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ప్రశ్నించారు.


అలాగే,ఖానాపూర్‌లో తమ సమస్య చెప్పుకొనేందుకు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన వృద్ధ రైతుపట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుపై చేయిచేసుకున్న పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ హరీశ్‌ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ ఆలయ కోడెలకు కనీసం ఆహారం కూడా పెట్టలేని దుస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం ఉందా? అని మండిపడ్డారు. రోజూ కోడెలు చనిపోతున్నా వాటిని కాపాడుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే పాలన ఏ విధంగా సాగుతుందో అర్థమవుతోందన్నారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 03:32 AM