Share News

Harish Rao: అన్నదాతల బాధలు వినే తీరిక లేదా?

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:07 AM

అందాల పోటీలకు వెళ్లే తీరిక ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల బాధలు, కష్టాలు వినే తీరిక లేకుండాపోయిందని మాజీమంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

Harish Rao: అన్నదాతల బాధలు వినే తీరిక లేదా?

  • జనుము, జీలుగ విత్తనాలు అందించరా?: హరీశ్‌

జగదేవ్‌పూర్‌/హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): అందాల పోటీలకు వెళ్లే తీరిక ఉన్న సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల బాధలు, కష్టాలు వినే తీరిక లేకుండాపోయిందని మాజీమంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు జనుము, జీలుగ విత్తనాలను ఎందుకు అందించలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ గ్రామ కార్యాలయాన్ని ప్రారంభించారు.


అనంతరం సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు చేయడానికి డబ్బుల్లేవని చెప్పే రేవంత్‌రెడ్డి వందల కోట్లతో అందాల పోటీలు ఎలా నిర్వహించారని నిలదీశారు. ప్రభుత్వ పరంగా అందాల పోటీలను నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజుశ్రవణ్‌ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం అందాల పోటీలకు ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. అకాల వర్షాలతో పంటనష్టపోయి విలవిల్లాడుతున్న రైతన్నల ఆవేదనను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Updated Date - Jun 02 , 2025 | 05:07 AM