Home » Guntakal
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి మంగళ వారం ఎన్యుమరేషన ఫారాన్ని స్వయంగా పూరించి సంబంధిత బీఎల్‌వోకు అందజేశారు.
ఖరీఫ్ సీజన ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో డి. హీరేహాళ్ మండల కేంద్ర రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ఎదురు చూస్తున్నారు. డ బ్బులు చెల్లించి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.
మండలంలోని మోపిడి గ్రామంలో వికసిత భారత, గ్యారంటీ ఫర్ రోజ్‌ఘార్ అజీవికా మిషన గ్రామీణ పథకాన్ని జడ్పీ సీఈవో విజయలక్ష్మి గురువారం ప్రారంభిం చా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్ణీత సమయంలోనే కూలీలకు బిల్లులు చెల్లిస్తారని, బిల్లుల చెల్లింపు ఆలస్యమైతే అందుకు పరిహారం ఇస్తారని తెలిపారు.
పట్టణంలోని అనంతపురం- బళ్లారి జాతీయ రహదా రిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. రాముల మ్మ గుడి నుంచి సత్యం కల్యాణమండపం వరకు రోడ్డు మధ్యలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సగానికి పైగా లైట్లు వెలగడం లేదు.
పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్ లింపో ఇస్టియో సైటోసిస్ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.
స్థానిక ఆర్టీసీ బ స్టాండ్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల రక్షణ కోసం పోలీసులు పట్ట ణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని కెమెరాలకు లెన్సలు పోగా, మరికొన్ని పనిచేయ డంలేదు.
జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు పట్టణంలోని సరోజిని నాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ దినోత్సవానికి ముఖ్యఅ తిథిగా డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు. వైద్యులు సుజాత, కృష్ణనాయక్, జయవర్ధన రెడ్డిని శాలువ, పూలమాలతో సత్కరించారు.
సామాజిక పింఛన పే దలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పే ర్కొన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన ఇంటి వద్దకే పిం ఛన పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకటో తేదీన ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదే అన్నారు.
పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణంలో సహకార వారోత్సవాల్లో భాగంగా బుధవా రం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రైతులకు, ప్రజలకు డా క్టర్ వినీత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు.