LACHANNA; ఘనంగా గౌతు లచ్చన్న జయంతి
ABN , Publish Date - Aug 17 , 2025 | 12:04 AM
పట్టణంలోని ఆర్ జితేంద్రగౌడ్ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
గుంతకల్లుటౌన, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్ జితేంద్రగౌడ్ క్యాంపు కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ జితేంద్రగౌడ్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం, స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అన్నారు. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికారి ప్రతినిధి పవనకుమార్ గౌడ్, నాయకులు కేశప్ప, బండి లక్ష్మీదేవి, జయమ్మ, మాధవి, అనిల్‌గౌడ్, రాముడు, వెంకటేశ్వర్లుగౌడ్, చలపతి, రవిశంకర్‌గౌడ్, శ్రీరాములుగౌడ్, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.