Home » GST Collections
జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో పది శాతం పన్ను తగ్గించడంతో కారు ధరలు రూ.లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
జీఎస్టీ తగ్గింపు రేట్లు పేదల వినియోగ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడతాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఐదు కోట్ల మందికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకం ఆరోగ్య ఖర్చును తగ్గించడానికి, పేదలకు DBT (సంక్షేమ పథకాలు) శ్రమ డబ్బుకు అదనపు ఆదాయంగా ఉంటాయని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధితో రూ
రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలకు ఇదే అత్యధికం.
ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.3,354 కోట్లు వసూలవగా, ఇది 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికం. అన్ని రకాల పన్నుల ద్వారా మొత్తం ఆదాయం రూ.4,946 కోట్లు నమోదై రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలిచింది
జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో అదుర్స్ అనిపించాయి. గడిచిన నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వచ్చాయి. నేడు (మే 1)న విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.