Home » FIFA World Cup
ఫిఫా వరల్డ్‌కప్2026లో ఫ్రాన్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్వీడన్‌ను 3-0 తేడాతో ఓడించింది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ ఎంబాపె మరోసారి మెరిశాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తమకు కలిసొచ్చిన ‘అజ్టెకా స్టేడియం’లో ఇవాళ జరిగిన రౌండ్-32 నాకౌట్ మ్యాచ్‌లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది.
జర్మనీ స్టార్ గోల్‌కీపర్ మనువెల్ నోయర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్2026లో జర్మనీ జట్టు ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో 40 ఏళ్ల నోయర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా మొరాకోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్స్ ఫుట్‌బాలర్ కూడీ హక్పో విచిత్ర పరిస్థితినే ఎదుర్కొన్నాడు. లోకం చూడకుండానే తన బిడ్డ మరణించినా.. పుట్టెడు దుఃఖంలోనూ ప్రపంచకప్‌లో గోల్ చేశాడు. ఆ తర్వాత...
ఫిఫా ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు మొరాకో అర్హత సాధించింది.
ఫిఫా ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ జర్మనీకి భారీ షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జర్మనీ 3-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం కెనడా రౌండ్ 16కు దూసుకెళ్లింది. లాస్‌ఏంజెలెస్‌లో ఉత్కంఠభరితంగా సాగిన నాకౌట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో నెగ్గింది.
ఫిఫా ప్రపంచ కప్‌లో నాకౌట్ దశకు చేరాలన్న ఇరాన్ కల చివరి క్షణంలో ఛిద్రమైంది. అయితే తమ దేశానికి వెళ్లే ముందు ఇరాన్ ప్లేయర్లు లాకర్ రూమ్‌లో ఓ లేఖ రాసి వదిలి వెళ్లారు. ఇప్పుడు అది నెట్టింట వైరల్ అవుతోంది.
క్రీడారంగంలోని రెండు వేరు వేరు ఆటలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 2002 ప్రపంచకప్ విజేత రొనాల్డిన్హో నజారియో అమెరికాలో కలిశారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో సంచలనం నమోదైంది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాల్లో ఒకటైనా కాబో వెర్డె ఫిఫా వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది.