Share News

ఫిఫా ప్రపంచ కప్: నెదర్లాండ్స్‌కు షాక్.. రౌండ్ ఆఫ్ 16కు మొరాకో

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:07 AM

ఫిఫా ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు మొరాకో అర్హత సాధించింది.

ఫిఫా ప్రపంచ కప్: నెదర్లాండ్స్‌కు షాక్.. రౌండ్ ఆఫ్ 16కు మొరాకో
Morocco vs Netherlands

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది. ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. 3-2 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు మొరాకో అర్హత సాధించింది. తొలుత నిర్ణీత సమయం వరకు ఇరుజట్లు 1-1తో సమంగా నిలవడంతో.. పెనాల్టీ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్‌లో మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌనూ కీలక పాత్ర పోషించాడు. నెదర్లాండ్స్ ఐదో షాట్‌గా వచ్చిన క్రెసెన్సియో సుమర్విల్లే ప్రయత్నాన్ని అద్భుతంగా అడ్డుకుని జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం ఇస్మాయిల్ సాబిరీ చివరి పెనాల్టీని గోల్‌గా మలిచి మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు.


నిర్ణీత సమయానికి ముందే ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. రెండో అర్ధభాగంలో కోడీ గాక్‌పో గోల్ చేసి నెదర్లాండ్స్‌కు ఆధిక్యం అందించాడు. అయితే ఇంజూరీ టైంలో మొరాకో అద్భుతంగా పుంజుకుంది. చెమ్‌స్డిన్ తల్బీ ఇచ్చిన క్రాస్‌ను ఇస్సా డియోప్ హెడ్డర్‌తో గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. మొరాకోకు గెలిచే అవకాశం వచ్చినా వెర్‌బుగెన్ అద్భుత సేవ్‌తో అడ్డుకున్నాడు. చివరికి పెనాల్టీల్లో ప్రారంభంలో మొరాకో ఒక షాట్‌ను కోల్పోయినప్పటికీ, తర్వాత తిరిగి పుంజుకుని చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. కాగా ఈ విజయంతో రౌండ్ 16కు చేరుకున్న మొరాకో.. శనివారం కెనడాతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

Updated Date - Jun 30 , 2026 | 11:07 AM