Home » Facebook
తన మరిదితో ప్రేమలో పడిన ఓ మహిళ తన భర్త సమక్షంలోనే అతడిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్తే దగ్గరుండి మరీ తన భార్యకు, ఆమె మరిదికి వివాహం జరిపించాడు. ఒడిశాలోని సోన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహ తెలియని అమాయక చిన్నారులను అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏది మంచో, ఏది చెడో తెలియని చిన్నారుల విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే అలాంటి ప్రమాదం కూడా జరుగుతుందా అనిపిస్తుంది
చాక్లెట్లు దొంగతనం చేసిన ఓ వ్యక్తికి బ్రిటన్ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. అదేంటి.. చాక్లెట్లు దొంగిలించినందుకు అంత శిక్ష పడిందా అని ఆశ్చర్యపోతున్నారా? అతను దొంగిలించిన చాక్లెట్లు ఒకటి, రెండు కాదు.. ఏకంగా 2 లక్షల చాక్లెట్లను దొంగిలించాడు. ఆ చాక్లెట్ల ఖరీదు అక్షరాలా రూ.42 లక్షలు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు ఆసక్తికరంగా అనిపించిన వాటిని, నవ్వు తెప్పించిన వాటిని ట్విటర్‌లో పోస్ట్ చేసి అందరితో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఆసక్తికర వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.
అడవిలోని సింహాలు, పులులు తమ ఆహారం కోసం ఎక్కువగా వేటాడే జంతువుల్లో అడవి గేదెలు కూడా ఒకటి. భారీ ఆకారంతో ఉండే అడవి గేదెలు దొరికితే సింహాలకు విందు భోజనమే. అయితే అడవి గేదెలను వేటాడడం అంత సులభం కాదు. సింహాలను సైతం ఎదురించగల బలం అడవి గేదెలకు ఉంటుంది.
జంతువుల మధ్య జరిగే పోరాటం అనూహ్యంగా, అప్పుడప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాంటి ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తరచుగా అప్‌లోడ్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి చాలా మందికి షాక్ కలిగిస్తోంది.
ప్రేమ (Love)కు వయసుతో సంబంధం లేదు. నిజానికి వయసులో ఉన్నప్పుడు ఆడ, మగ మధ్య పుట్టేది ఆకర్షణ మాత్రమే. వయసు మళ్లాకే ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. 20, 30 ఏళ్లు కలిసి జీవించిన తర్వాతే భార్యాభర్తల మధ్య నిజమైన అనుబంధం, ఆప్యాయత మొదలవుతాయి.
ఆ యువతి మహా తెలివైనది.. తన ప్రియుడిని కలిసేందుకు అద్భుతమైన స్కెచ్ వేసింది.. గ్రామస్థులందరి కళ్లూ కప్పి తన ప్రియుడిని కలుసుకునేది.. అదే ప్లాన్ ఉపయోగించి చాలా సార్లు తన ప్రియుడిని గ్రామంలోనే కలుసుకునేది.. చివరకు ఒక రోజు ఆ యువతి పథకం విఫలమైంది.. దీంతో ఆమె బండారం బయటపడింది..
మీరు ``సీతారామం`` సినిమా చూశారా? ఆ సినిమా మొత్తం ఓ పోస్ట్ కార్డు చుట్టూ తిరుగుతుంది. ఎన్నో ట్విస్ట్‌ల తర్వాత ఆ పోస్ట్ కార్డు చేరాల్సిన వారికి చేరుతుంది. సినిమాలో లాగ ప్రేమ కథ కాదు కానీ, తన క్షేమాన్ని తెలియజేస్తూ ఓ వ్యక్తి తన కుటుంబానికి పంపిన పోస్ట్ కార్డు 54 ఏళ్ల ఆలస్యంగా చేరుకుంది.
ముంబై లోకల్ ట్రైన్ అనగానే చాలా మందికి మొదటగా గుర్తుకు వచ్చేది ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కోచ్‌లు. ఉద్యోగాల కోసం, చదువుల కోసం ప్రయాణికులు ఒక చోట నంచి మరో చోటుకు వెళ్లేందుకు ఎక్కువగా లోకల్ రైళ్లనే ఆశ్రయిస్తారు. దాంతో ఆ రైళ్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి.