Facebook Crime: ఫేస్‌బుక్‌లో కలిసింది.. తియ్యని మాటలతో పడేసింది.. చివర్లో పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా!

ABN , First Publish Date - 2023-08-07T19:29:12+05:30 IST

సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్లు.. సామాజిక మాధ్యం ద్వారా వలపు వల వేస్తున్నారు. స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి.. నగ్న వీడియో చాటింగ్ ముగ్గులోకి దింపి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు.

Facebook Crime: ఫేస్‌బుక్‌లో కలిసింది.. తియ్యని మాటలతో పడేసింది.. చివర్లో పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా!

సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న కొద్దీ.. సైబర్ నేరాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్లు.. సామాజిక మాధ్యం ద్వారా వలపు వల వేస్తున్నారు. స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి.. నగ్న వీడియో చాటింగ్ ముగ్గులోకి దింపి.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారు. లక్షల్లో బాధితుల నుంచి దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఇలాంటి సైబర్ నేరం బారిన పడి.. భారీ డబ్బులు కోల్పోయాడు. తనకు అందమైన యువతి దొరికిందని ఆనందించేలోపే, ఏకంగా రూ.41 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరికి పోలీసుల్ని ఆశ్రయించి, తనని టార్చర్ పెట్టిన ఆ సైబర్ నేరస్తుడికి తగిన బుద్ధి చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

రామనగర జిల్లాకు చెందిన రాజేశ్ అనే యువకుడికి ఒక రోజు ఫేస్‌బుక్‌లో ఓ యువతి ప్రొఫైల్ కనిపించింది. ఫోటోల్లో ఆ యువతి అందానికి దాసోహమై, ఆమెకి రిక్వెస్ట్ పెట్టాడు. కొద్దిసేపట్లోనే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో.. వెంటనే మెసేజ్ పెట్టాడు. అటువైపు యువతి నుంచి కూడా రెస్పాన్స్ రావడంతో.. చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ యువతి ఇంకా తియ్యని మాటలు మాట్లాడటం స్టార్ట్ చేయగా, బహుశా ఆమె తనకు ఫిదా అయ్యిందేమోనని రాజేశ్ భావించాడు. ఈ క్రమంలోనే ఆ యువతి ఓసారి నగ్నంగా వీడియో కాల్ చేయమని చెప్పింది. దీంతో.. మరో క్షణం ఆలోచించకుండా అతడు వీడియో కాల్ చేశాడు. ఇక్కడే అతడు పప్పులో కాలేశాడు. అప్పటివరకు మాయమాటలు చెప్పిన ఆ యువతి.. ఆ న్యూడ్ వీడియో కాల్ తర్వాత రాజేశ్‌కి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.


అదేంటో తెలుసా? ఇన్నాళ్లూ రాజేశ్‌తో చాటింగ్ చేసింది అమ్మాయే కాదు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు రవికుమార్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన ఇతడు, ఈజీమనీకి అలవాటు పడి, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా అబ్బాయిలకు గాలం వేస్తూ వచ్చాడు. అలాగే రాజేశ్‌ని యువతి పేరుపై ఫేక్ ఫ్రొఫైల్‌తో బురిడీ కొట్టించాడు. ‘‘నా దగ్గర నీ నగ్న వీడియోతో పాటు పర్సనల్ ఫోటోలున్నాయి, నేను అడిగినంత డబ్బులివ్వకపోతే వాటిని ఆన్‌లైన్‌లో పెడతాను’’ అని రవికుమార్ బెదిరించాడు. ఆ ఫోటోలు బయటపడితే తన పరువు పోతుందన్న భయంతో.. విడతలవారీగా రవికుమార్‌కు రూ.41 లక్షలు సమర్పించుకున్నాడు. అయినా ఆ రవికుమార్ విడిచిపెట్టలేదు. ఇంకా డబ్బులు కావాలంటూ.. రాజేశ్‌ని టార్చర్ పెడుతూ వచ్చాడు.

రవికుమార్ వేధింపులు భరించలేకపోయిన రాజేశ్.. చివరికి పోలీసుల్ని సంప్రదించాడు. ఫేక్ ప్రొఫైల్‌తో రవికుమార్ తనని మోసం చేశాడని.. పర్సనల్ ఫోటోలతో బెదిరిస్తూ రూ.41 లక్షలు దోచుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడి ఆచూకీ కనుగొని, అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతడ్ని విచారించగా.. మరిన్ని షాకింగ్ ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. అతడు కేవలం రాజేశ్‌ని మాత్రమే కాదు, ఇంకా చాలామంది అబ్బాయిల్ని ఇలాగే వలపు వల వేసి చాలా డబ్బులు దోచుకున్నట్టు తేలింది. అందుకే ఉద్యోగం మానేసి, ఈ సైబర్ క్రైమ్‌కి పాల్పడుతూ వచ్చాడని తెలిసింది.

Updated Date - 2023-08-07T19:29:12+05:30 IST