Wife-Husband: పిల్లల్ని కనలేని భార్య నాకొద్దు.. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భర్త.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..!

ABN , First Publish Date - 2023-07-28T16:28:07+05:30 IST

ఆ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత అతడి భార్య అనారోగ్యానికి గురైంది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆమె గర్భాశయంలో సమస్య ఉందని తెల్చారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

Wife-Husband: పిల్లల్ని కనలేని భార్య నాకొద్దు.. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన భర్త.. ఫైనల్‌గా ఏం తేల్చారంటే..!

ఆ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం (Marriage) జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత అతడి భార్య అనారోగ్యానికి గురైంది. తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. స్కానింగ్ తీసిన డాక్టర్లు ఆమె గర్భాశయంలో (Uterus) సమస్య ఉందని తెల్చారు. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు. షాకైన భర్త తన భార్యను పుట్టింటికి పంపేశాడు. పిల్లలను కనలేని భార్య తనకు వద్దని, విడాకులు (Divorce)ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.

ఆ వ్యక్తి పిటిషన్‌ను విచారించిన పాట్నా హైకోర్టు (Patna high court) తాజాగా తుది తీర్పు వెలువరించింది. ``పిల్లలను కనలేకపోవడం అనేది నపుంసకత్వం కాదు. అలాగే విడాకులకు సరైన కారణం కూడా కాదు. పిల్లలను కనలేకపోవడం అనేది చాలా మంది వైవాహిక జీవితాల్లో జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో దత్తత తీసుకోవడం వంటి వేరే మార్గాలను ఆశ్రయించాలి. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇలాంటి సందర్భాల్లో విడాకులు మంజూరు చేయలేం`` అని జస్టిస్ జితేంద్ర కుమార్, జస్టిస్ పీబీ భజంత్రిలతో కూడా ధర్మాసనం పేర్కొంది.

Lions Viral Video: పొద్దున్నే గుడికి వెళ్లిన పూజారి.. సడన్‌గా సింహాలు ఎంట్రీ.. అవి భయపడి పారిపోవాలని అతడేం చేశాడో చూస్తే..!

ఆ మహిళ వివాహం తర్వాత కేవలం రెండు నెలలు మాత్రమే భర్తతో కలిసి ఉంది. ఆమెకు విడాకులు ఇచ్చి మరో మహిళను వివాహం చేసుకోవాలని భర్త కోరుకుంటున్నాడు. మొదట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దాంతో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో కూడా అదే తీర్పు పునరావృతమైంది.

Updated Date - 2023-07-28T16:28:07+05:30 IST