Home » Employees
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సిబ్బంది(జూనియర్ డాక్టర్లు, పీజీ వైద్య విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు)కి వేతన కష్టాలు తీరనున్నాయి. ప్రతినెలా మొదటి వారంలోనే వారికి జీతాలు, స్టైపెండ్ చెల్లించేలా ‘గ్రీన్ చానల్’ ఏర్పాటుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
రాష్ట్రంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. ఇంటి నెంబరు కేటాయించేందుకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆమెకు సహకరించిన బిల్ కలెక్టర్ బాల్‌రాజ్ ఏసీబీకి పట్టుబడ్డారు.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసే ముఠాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోసగాళ్ల వలలో చిక్కుకుని పలువురు నిరుద్యోగులు లక్షలాది రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు.
బల్దియా కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జీహెచ్‌ఎంసీ అధికారుల వైఖరిని నిరసిస్తూ పోరుకు దిగారు. ఇప్పటికే ఇచ్చిన డెడ్‌లైన్ (ఈనెల 18)లోగా బకాయిలు చెల్లించాలని కొన్ని నెలల క్రితం జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో నిర్వహణ పనులను నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డీఏ లభించనుంది. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంవో కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో డీఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
విశాఖ: గంగవరం పోర్ట్ కార్మికుల ఉద్యమం కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి విధుల్లోకి చేరారు. రేపటి నుంచి ప్రోడక్షన్ దిశగా విశాఖ ఉక్కు కర్మాగారం పని చేయనుంది. ఒన్ టైమ్ సెటిల్‌మెంట్ దిశగా గంగవరం పోర్ట్ కార్మికులు అడుగులు వేస్తున్నారు. గత 41 రోజులు, ఇప్పుడు 20 రోజులుగా చేస్తున్న ఉద్యమనికి ఉద్యోగులు స్వస్తి పలికారు.
తెలంగాణ విద్యుత్ సంస్థలపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకోమని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ సంస్థల ప్రతిష్ఠను మరింత దిగజారుస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.శంకర్, సంయుక్త కార్యదర్శి డి.కోటేశ్వరరావు, జాతీయ ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ సీజీఎం ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు, రిటైర్డ్ అధికారులను సీఎండీలు, డైరెక్టర్లుగా నియమించి సంస్థను నిలువు దోపిడీ చేశారన్నారు. పదోన్నతులు, పోస్టింగుల్లో పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడ్డారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్లు కూడబెట్టారని ఆరోపించారు.
తెలుగు అకాడమీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. వారికి పెన్షన్ బకాయిలతో పాటు, జాప్యం జరిగినందుకు వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పింఛను అనేది రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే దానమో, వరమో కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది.
ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు దక్కడం లేదు. సాధ్యమైనంతమేరకు ఓటింగ్‌కు వారిని దూరంగా పెట్టాలని చూస్తున్నారేమో అన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడో రోజు ఆదివారం కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై గందరగోళం కొనసాగింది. ఎన్నికల సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, అంతర్ జిల్లా ఓటర్లకు డ్వామా ...
ఉమ్మడి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఓటింగ్‌కు దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం, పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం ఎక్కడన్న దానిపై ఓటింగ్ రోజు వరకూ స్పష్టత ఇవ్వకపోవడం, ఫెసిలిటేషన సెంటర్లకు మధ్యాహ్నం 3 గంటలైనా బ్యాలెట్ పేపర్లు సరఫరా కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ...