Home » East Godavari
కాకినాడ: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలింది. రొయ్యల ప్రోసెస్ ద్వారా వచ్చే కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారు. ఫ్యాక్టరీల కాలుష్యంపై పీసీబీకి దొంగ లెక్కలతో మాయ చేస్తున్నారు. అనుమతి లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్లు మాయ చేసి చూపారు. వీటి ఉల్లంఘనలను అధికారులు తనిఖీల్లో గుర్తించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 2(ఆంధ్ర జ్యోతి): సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా సెల్ఫోన్ల రికవరీ సులభం అవుతోందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న/దొంగతనానికి గురైన సంద ర్భాల్లో వెంటనే సీఈఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయం
అనపర్తి/సామర్లకోట, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): దాణా రేట్లు, నిర్వహణా ఖర్చులు గణనీ యంగా పెరగడంతో రెండేళ్లుగా కోళ్ల పరిశ్రమ న ష్టాల్లో నడిచింది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.08 పైసలకు పెరగడంతో రైతులు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నారు. 15 నుంచి 20 రోజులుగా ఈ ధర అటు ఇటుగా ఉన్నప్పటికీ రైతుకు కొంత మే ర ప్రయోజనం చేకూరుతోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద చిన్న ఫారాలు సుమారుగా 300నుంచి 350 వరకు ఉన్నాయి. వీటిలో సుమారుగా 1.5 కోట్ల కోళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1 కోటి వరకు ఉత్పత్తి అవుతుండగా వీటిలో 40 శాతం వరకు స్థానిక అవసరాలకు
కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవ న్‌కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చు కోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు.
బిక్కవోలు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడలు ప్రతి విద్యార్థికి అవసరమని తూర్పుగోదావరి జిల్లా విద్యా శాఖాధికారి పి.వాసుదేవరావు అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జడ్పీ హైస్కూల్ ప్లస్‌లో నిర్వహిస్తున్న 68వ అంతర జిల్లాల బాల్
రాజానగరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై రాజానగరం-కలవచర్ల జం క్షన్లో శుక్రవారం రాత్రి గ్రానైట్ బండరాళ్ల లోడు తో వెళ్తున్న లారీని ఐరన్ లోడుతో వస్తున్న మరో లారీ ఢీకొంది. స్థానికుల వివరాలు ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు నుంచి కాకినాడ పోర్టు కు మూడు బండరా
కాకినాడ: జీజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఓ పాజిటివ్ బదులు హౌస్ సర్జన్ ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో పేషెంట్ భావన శిరీష(34) అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆసుపత్రిలోనే మరణించింది.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్లను బీసీ వెల్ఫేర్
కాకినాడ: పొట్టకూటి కోసం కువైట్‌కు వెళ్లిన ఓ ఏపీ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్‌లో పనిలో పెట్టుకున్న యజమాని పని చేయించుకుని సరిగా భోజనం పెట్టక చిత్రహింసలకు గురి చేస్తుండటంతో.. ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.