మంత్రి నాదెండ్లకు ఘన స్వాగతం
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:09 AM
కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృ

కోరుకొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సివిల్ సప్లయి శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు శనివారం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాల్లో బాధితులైన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా చెక్కులు అందజేసేందుకు వచ్చిన మంత్రి నాదెండ్లకు మధురపూడి విమనాశ్రయం వద్ద పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వాగతం పలికారు. నాదెండ్లకు ఎమ్మెల్యే బత్తుల గజమాల వేసి సత్కరించారు. ధాన్యం బస్తాలతో నిండిన రెండెడ్ల బండి నమూనాను అందజేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే బత్తుల రూపొందించిన 2025 సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జనసేన నా యకురాలు బత్తుల వెంకటలక్ష్మి, తోట పవన్‌కుమార్, జనసైనికులు,వీర మహిళలు ఉన్నారు.