వేతనదారులకు తీపి కబురు!
ABN , Publish Date - Jan 05 , 2025 | 12:26 AM
పెద్దాపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్భం దీగా అమలుచేయడంతో పాటు వేతనదారుల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం బోగస్ మస్తర్లకు అడ్డుకట్టవేయడ ంతో పాటు పనివేళల్లో మార్పులుచేసి వేతనదారులకు గిటు ్టబాటు వేతనం అందించేం
ఇకపై ఉపాధి హామీ పథకం పకడ్భందీగా అమలు
కనీస వేతనం రూ.300కి పెంపు
బోగస్ మస్తర్లకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కమిటీలు
వేతనదారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
పెద్దాపురం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్భం దీగా అమలుచేయడంతో పాటు వేతనదారుల కనీస వేతనాన్ని రూ.263 నుంచి రూ.300కి పెంచి ఇవ్వటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ విభాగం బోగస్ మస్తర్లకు అడ్డుకట్టవేయడ ంతో పాటు పనివేళల్లో మార్పులుచేసి వేతనదారులకు గిటు ్టబాటు వేతనం అందించేందుకు పర్యవేక్షణ చేయనుంది. ఈ విభాగానికి డ్వామాలో కీలకంగా జిల్లా విజిలెన్స్ అధికారిని నియమించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనదారులు ప్రస్తుతం నాలుగు గంటలు పాటు పనిచేస్తున్నారు. అదనంగా మరో గంట పెంచేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఉపాధి సిబ్బంది, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలు నిత్యం మస్తర్లు తనిఖీ చేయాలి. ఈతరహా చర్య లతో వేతనాదారులకు సగటున మూడు వందల రూపాయల వేతనం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం అందాలంటే ఏయే పనులు ఎంత సమయంలో చేయాల్సి ఉంటుందనే అంశాలపై జిల్లా స్థాయిలో ఏర్పా టు చేసిన వేతన పర్యవేక్షణ విభాగం పర్యవేక్షిస్తుంది.
శ్రమశక్తి సంఘాల పునరుద్ధరణ
గతంలో 20 నుంచి 30 మంది వేతనదారులతో శ్రమశక్తి సంఘాలు (ఎస్‌ఎస్‌ఎస్)గా 20 ఏర్పాటుచేసి వారికి మేట్‌లను నియమించేవారు. వారికి ఏటా శిక్షణ ఇచ్చేవారు. ఈసంఘాలు కొన్ని నిర్దిష్టమైన పనులు చేసేవి. మేట్‌లు అందరూ ఫీల్డ్ అసి స్టెంట్లకు సహాయంగా ఉండేవారు. దీంతో పథకం సజావుగా సాగేది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో శ్రమశక్తి సంఘాలను పట్టించుకోకపోవడంతో కనుమరుగయ్యాయి. ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా జరగకపోవడానికి వేతనదారు లకు రూ.300 అందడానికి సిబ్బందితో పాటు శ్రమశక్తి సంఘాలను తిరిగి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మండల స్థాయి సిబ్బందికి కూడా మారుతున్న కాలాన్ని బట్టి జాబ్ చార్ట్‌పై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.
నిబంధనలు ఇవే..
ఉపాధి వేతనదారులకు వేతనం పెరగడానికి ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ముందస్తుగా అంచనాలు తయారుచేయాలి. నేల స్వభావం, వేతనదారుల పనిచేయడానికి అనువుగా ఉండేలా గుర్తించాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకుని పనులు కల్పించాలి. పనివేళల్లో మార్పులు చేయాలి. సాంకేతిక సహాయకులు నిత్యం పర్యవేక్షించాలి. ఏపీడీ, ఏపీవో, ఎంపీడీ వోలు మస్తర్లు తనిఖీ చేయాలి. వేతనదారులు చేసే పనివేళలు, కొలతలు పారదర్శకంగా లెక్కించాలి. వేతనాలు రసీదులు కచ్చి తంగా ఇవ్వాలి. పనులు చేపట్టే ప్రదేశంలో వేతనదారులకు ప్రధమ చికిత్స కిట్లతోపాటు తాగునీరు సదుపాయం కల్పించాలి. ప్రభుత్వం అందచేస్తున్న టెంట్లు తప్పనిసరిగా పనిచేసే చోట ఏర్పాటుచేయాలి.
బోగస్ మస్తర్లకు అడ్డుకట్ట
ఉపాధి పనుల్లో ఇప్పటికే బోగస్ మస్తర్ల బాగోతం నడు స్తోంది. వేతనదారులు పనికి రాకపోయినా హాజరైనట్టు కొందరు సిబ్బంది మస్తర్లు వేసి వేతనాలు స్వాహా చేసిన సందర్భాలు ఉన్నాయి. వేతన దినాలు దుర్వినియోగం కావడంతో పాటు పనులకు హాజరైన వేతనదారులకు పూర్తిగా వేతనం అందడం లేదు. అక్రమాలు అరికట్టడానికి జిల్లాస్థాయిలో పర్యవేక్షించే విజిలెన్స్ అధికారి సమన్వయం చేస్తారు. గత వైసీపీ పాలనలో పలు అక్రమాలు జరిగాయి. దీంతో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత అనేకచోట్ల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారినుంచి రకవరీ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
లక్ష్యానికి అనుగుణంగా పనివేళలు
జాబ్ కార్డు ఉన్నవారందరికీ దినసరి వేతనం రూ.300 అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వేతనదారుల పనివేళలు పెంచాలి. రోజుకు నాలుగు గంటలు పనిచేసేవారు అదంగా మరో గంట చేస్తే కూలీ గిట్టుబాటు అవుతుంది. వేతన పెంపుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందిని అదేశించాం.
-డి.శ్రీలలిత, ఎంపీడీవో, పెద్దాపురం