బూరుగుపూడిలో రేవ్ పార్టీ
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:45 AM
కోరుకొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజాన గరం నియోజకవర్గం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యకిషోర్ సోమవారం మధ్యాహ్నం వివరాలను

ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు
13 మంది యువకులు, ఐదుగురు యువతుల అరెస్టు
కోరుకొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజాన గరం నియోజకవర్గం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యకిషోర్ సోమవారం మధ్యాహ్నం వివరాలను వెల్లడించారు. ఈ నెల 27న గుజరాత్ మైక్రో న్యూట్రీషియన్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ రూ.18 వేలకు కోరుకొండ మండలం బూరుగుపూడి జం క్షన్ వద్ద ఉన్న ఏబీఆర్ ఇన్‌ఫ్రా నాగసాయిరాం ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇక్కడికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తణుకు, ఆచంట తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం, ధవళేశ్వరం ప్రాం తాలకు చెందిన 10 మంది ఎరువుల డీలర్లను రప్పించారు. గోపాలకృష్ణకు పరిచయం ఉన్న కాకినాడకు చెందిన అను అనే అమ్మాయి ద్వారా ముగ్గురు యువతులను రంపచోడవరం, ధవళేశ్వరం ప్రాంతాల నుంచి ఇద్దరు మొత్తం ఐదుగు రు యువతులను ఆదివారం రాత్రి ఫంక్షన్ హాల్ కు రప్పించారు. ఫంక్షన్ హాలులో రూ.15 వేలకు 5 రూమ్‌లు బుక్ చేశారు. వారందరూ మద్యం తాగుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చేస్తూ ఎం జాయ్ చేస్తున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌కి వచ్చిన సమాచారం మేరకు స్పెషల్ పోలీస్, లోకల్ పోలీసులు ఫంక్షన్ హాల్‌పై రైడ్ చేశారు. అక్కడ ఉన్న 13 మంది యువకులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. యువతులను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ఫంక్షన్ హాల్ యజమాని సత్తి భామిరెడ్డి పరారీలో ఉండడంతో కుమారుడు రామిరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్, సూత్రధారుడైన గోపాలకృష్ణ, 10 మంది ఎరువుల డీలర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్న సౌండ్ సిస్టమ్, రూ.61 వేలు నగదు, గోపాలకృష్ణ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఇద్దరు యువతులను రూమ్‌ల్లో పట్టుకున్నామన్నారు. కేసు లోతుగా విచారణ జరుగుతుందన్నారు. సమావేశంలో కో రుకొండ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఎండీ అశ్వాక్ ఉన్నారు.
నిర్వాహకులను అరెస్టు చేశాం : ఎస్పీ
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బూరుగుపూడి జంక్షన్ వద్ద నిర్వహించింది రేవ్ పార్టీ కాదని అక్కడ మహిళలతో కొంత మంది పార్టీ చేసుకుంటున్నట్టు తెలిసి దాడి చేసి నిర్వాహకులతో పాటు 13 మం దిని అరెస్టు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఓ ప్రకటనలో తెలిపా రు. జిల్లాలో అసభ్యకరంగా పార్టీలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.