బంధువే.. బలి తీసుకున్నాడు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:44 AM
ఎటపాక, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అ ల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలోని ఆదివాసీ గ్రామమైన మద్దిమడుగులో సోమవారం సాయంత్రం ఓ బా లుడిని సమీప బంధువు గొడ్డలితో నరికి చం పాడు. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం

బాలుడిని నరికి చంపిన కిరాతకుడు
మద్దిమడుగు గ్రామంలో ఘటన
ఎటపాక, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అ ల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలోని ఆదివాసీ గ్రామమైన మద్దిమడుగులో సోమవారం సాయంత్రం ఓ బా లుడిని సమీప బంధువు గొడ్డలితో నరికి చం పాడు. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కోయనర సాపురానికి చెందిన ముర్రం కోటేశ్ తన బం ధువైన కణితి నాగరాజు(4)ని పత్తి చేను వద్ద గొడ్డలితో నరికి చంపాడు. ఇది చూసిన మరో బాలుడు గ్రామంలో చెప్పడంతో విషయం వెలు గుచూసింది. కాగా హంతకుడు, హత్యకు గురైన బాలుడు కోయనరసాపురానికి చెందినవారే. కొన్నే ళ్ల క్రితం కోటేశు, నాగరాజు తండ్రి కుటుంబాలు పోడు వ్యవసాయం కోసం మద్దిమడుగు ప్రాం తానికి వలసవెళ్లారు. 2 కుటుంబాల మధ్య అ ప్పుడప్పుడూ గొడవలు జరగడం, పెద్ద మను షులు కలుగజేసుకుని రాజీ చేయడం జరిగేవని తెలుస్తోంది. కాగా కోటేశ్ మానసిక స్థితి సరిగ్గా లేక హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘ టనాస్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్ పరారైనట్టు సమాచారం.