Home » Doctor
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలతోపాటు నిమ్స్‌లోని పీజీ వైద్య సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి 31వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
మరణానంతరం తమ దేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం మెడికల్ కాలేజీలకు దానం చేయాలనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది.
పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులకు చిల్లుపడటం వల్ల ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ యువకుడికి కామినేని వైద్యులు ఊపిరిపోశారు. ఆరునెలల పాటు అరుదైన వైద్య చికిత్సలు అందించి రక్షించారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా కీలక విభాగాలకు ఇంకా ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను ఇన్‌చార్జిల జాడ్యం వీడడం లేదు.
రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్-జామ్, హెల్తీడ్రింక్ ఇస్తారు.
ఉస్మానియాలో రోగులకు 15 ఈసీజీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ‘గుండెను పరీక్షించలేని ఉస్మానియా’ శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజకు ఇంకా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన ఉస్మానియా వైద్యశాల గుండె పనితీరును పరీక్షించలేని స్థితికి చేరింది. ఆస్పత్రిలోని ఈసీజీ(ఎలకో్ట్ర కార్డియో గ్రామ్) యంత్రాలు కొద్ది నెలలుగా పని చేయడం లేదు.
రాష్ట్రంలోని బస్తీ, పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. వారి స్థానాన్ని ఆయుష్ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఆక్రమించేస్తున్నారు. అయితే, ఆయా దవాఖానల్లో ఆయుష్ వైద్యుల సంఖ్య పెరగడం వెనుక జిల్లా వైద్యాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగ డాక్టర్ల (ఎంబీబీఎస్) సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు! గతంలో సర్కారు కొలువులంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది.