Home » Dengue
తెలంగాణలో డెంగీ పాజిటివ్ రేటు తగ్గిందని, వ్యాప్తి తీవ్రతను అదుపులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరు మహిళ కాగా, మరొకరు ఐదో తరగతి విద్యార్థి.
డెంగ్యూ వైరస్ కారణంగా రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలో రోజురోజుకూ సీజనల్ వ్యాధులు పెరుగుతుండటం.. ముఖ్యంగా డెంగీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దాని కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ రోగులకు ఓ ‘పరీక్ష’లా మారుతోంది. మధ్యాహ్నం అయితే చాలు ల్యాబ్‌లు మూతపడుతుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) రాక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటే, ఆ సమయం వరకే ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి.
గతంతో పోలిస్తే నగరంలో డెంగీ, చికున్ గున్యా(Dengue, Chikungunya) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి 16 మంది చికున్ గున్యా బారిన పడ్డారని అధికారిక లెక్కలు చెబుతుంటే.. కూకట్పల్లి బాలాజీనగర్(Kukatpally Balajinagar)లోని 8 ఫ్లాట్లు గల ఒక్క అపార్ట్మెంట్లోనే నలుగురు బాధితులు ఉండడం గమనార్హం.
తెలంగాణలో డెంగ్యూ(Dengue) మరణాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.
తెలంగాణలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజలు తీవ్ర అనారోగ్యం బారీన పడుతున్నారు. పదుల సంఖ్యలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల బాట పడుతున్నారు.
డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది.
డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి.