• Home » delhi liquor scam case

delhi liquor scam case

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్‌ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.

 CM Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను వారానికి రెండు సార్లు మాత్రమే కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

Delhi Liquor Scam: కవిత సంచలన లేఖ విడుదల.. లిక్కర్ స్కామ్‌పై ఏమన్నారంటే..

Delhi Liquor Scam: కవిత సంచలన లేఖ విడుదల.. లిక్కర్ స్కామ్‌పై ఏమన్నారంటే..

Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(K Kavitha) మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో(Liquor Scam) తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు..

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ వీడింది. నేడు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. సీబీఐ స్పెషల్ కోర్ట్ జడ్జి కావేరి భవేజా కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పును వెలువరించారు. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నేడు లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.

Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష

Arivind Kejriwal: ఆప్ నేతల నిరాహార దీక్ష

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Delhi liquor Scam: కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు: ఈడీ తరపున న్యాయవాది

Delhi liquor Scam: కవిత చిన్న కొడుకు ఒంటిరిగా ఏం లేడు: ఈడీ తరపున న్యాయవాది

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై గురువాం ఢిల్లీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా... ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు.

Liquor Scam Case: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

Liquor Scam Case: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు.

Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Delhi liquor Scam: ‘కొడుకుకు తల్లి మోరల్ సపోర్ట్ అవసరం’.. కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఆయనకి బెయిల్ మంజూరు

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఆయనకి బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో గతేడాది అరెస్టయిన ఆప్(AAP) నేతకు బెయిల్ మంజూరైంది. దీంతో ఈ కేసులో బెయిల్ పొందిన తొలి నేతగా ఆయన నిలిచారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి