Home » Cyclone
మత్స్యకారులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం అందేలా చర్యలు ఉంటాయని అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. బీమా, లోన్ సౌకర్యాలు పథకంలో ఉన్నాయని తెలిపారు.
తుపాను కారణంగా బాగా నష్టపోయామని.. ఎకరానికి రూ. 30 వేలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరనుందని.. అలాగే ప్రకాశం బ్యారేజీ వద్ద నేటి ఇన్ఫ్లో ఆరు లక్షలకు చేరుతుందని ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ వెల్లడించింది.
తుఫాన్ వల్ల దాదాపు 4576 కి.మీ మేర ఆర్ & బీ రహదారులు ధ్వంసమైనట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. 120 చోట్ల ఆర్ & బీ రహదారులు దెబ్బ తినగా.. 21 చోట్ల పునరుద్దరణ చేసినట్లు పేర్కొన్నారు.
మండలంలోని రాంపురం, కాచాపురం, నారాయణపురం గ్రామాల్లో దెబ్బతిన్న వరి,పత్తి పంటలను జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సుజాతమ్మ, సతీష్, ఆదోని ఏడీఏ బాలవర్ధిరాజు, మండల వ్యవసాయ అధికారులు గణేశ్, వరప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఏవోలు గణేశ్ వరప్రపాద్ పరిశీలించారు.
మొంథా తుఫాను ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో గురువారం పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ప్రకటించారు. మొంథా తుఫాను నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ తుఫాన్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను ఇక్కడ చూడండి.
మొంథా తుఫాను తెలంగాణలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
మొంథా తుఫాను వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల బుధవారం జోరువాన కురిసింది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.